నేటి నుంచి కార్బివ్యాక్స్ వ్యాక్సినేషన్.. 12-14 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. టీకా కోసం కొవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచన.
నేడు పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేసిన భగవంత్ మాన్.
నేడు జగనన్న విద్యా దీవెన కింద నగదు జమ… రూ.709 కోట్ల రూపాయాలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్.
హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లైఓవర్, నేడు ఎల్బీనగర్ అండర్‌పాస్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్, అరాంఘర్, మిథాని మార్గంలో తొలగనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
నేడు సీఎల్పీ సమావేశం.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నాల్గోవ రోజు.. ఇవాళ పుష్కరిణిలో 5 ప్రదక్షణములుగా తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అంశాల పరిష్కారానికి నేడు ఢిల్లీలోని కేంద్ర జలశక్తిశాఖ కార్యాలయంలో సమావేశం.. భేటీలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పాల్గొనే అవకాశం.