Kargil Night Landing: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గిల్ ప్రాంతంలోని ఎయిర్ స్ట్రిప్‌పై భారీ రవాణా విమానం C130-Jని రాత్రి సమయంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. లడఖ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్ చేయడం ఇదే మొదటిసారి. యూఎస్ లాక్‌డీడ్ మార్టిన్ తయారు చేసిన C-130J సూపర్ హెర్క్యూలస్ విమానాన్ని సరుకులు, సైనికులు రవాణాతో పాటు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వాడుతోంది.
Indian Air Force : భారత వైమానిక దళం సరికొత్త, చాలా సవాలుతో కూడిన ఫీట్‌ని సాధించింది. మొదటిసారిగా ఎయిర్ ఫోర్స్ (IAF) చీకటిలో కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో C-130J హెర్క్యులస్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది.