కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ కష్టాలు చుట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే వైద్యురాలి హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఆయనపై అనేక రకాలుగా అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా బెంగాల్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. దీంతో సందీప్ ఘోష్ ఇకపై తన పేరు ముందు డాక్టర్ అనే పదాన్ని చేర్చుకోవడానికి వీలుండదు. అంతేకాకుండా ప్రిస్క్రిప్షన్లు కూడా రాయడానికి అవకాశం ఉండదు. సెప్టెంబర్ 6న సందీప్‌కు షోకాజ్ నోటీసు పంపినట్లు రాష్ట్ర వైద్య మండలి నోటిఫికేషన్‌లో పేర్కొంది. నోటీసుకు సందీప్ సరైన సమాధానం ఇవ్వలేదని.. దీంతో రిజిస్టర్డ్ డాక్టర్ల రిజిష్టర్ నుంచి ఆయన పేరు తొలగించినట్లు రాష్ట్ర వైద్య మండలి గురువారం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Congress: బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు
ఆగస్టు 9న ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. న్యాయం చేయాలంటూ డాక్టర్లు రోడ్డెక్కారు. ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూడాలు పలుమార్లు చర్చలు జరిపారు. మరిన్ని డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబట్టారు. దీంతో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ను కస్టడీలోకి తీసుకుని సీబీఐ విచారిస్తోంది.
ఇది కూడా చదవండి: Jani Master: ఐదారేళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? జానీ మాస్టర్ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్ సంచలనం