Swarna Master Comments on Jani Master Issue: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి తనను ఆయన రేప్ చేశాడని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. రేపు ఆయనని హైదరాబాదులో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ అంశం మీద మరో లేడీ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు కామెంట్స్ చేశారు. ఐదారేళ్లుగా పని చేస్తుంది అంటున్నారు ఆ అమ్మాయి, అయితే ఐదారేళ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ అబ్బాయిది ఎంత తప్పు ఉందో ? నాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు.
Cine Honeytrap: సినీ హనీట్రాప్.. 40 లక్షలు కొట్టేసిన గ్యాంగ్ అరెస్ట్!
కానీ నేను ఒక ఇండస్ట్రీలో పనిచేసే మహిళగా చెబుతున్నాను, మనం ఏదైనా బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది మన చేతిలో ఉండేది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనం ఉన్నాం. మన మీద ఎవరో వచ్చి దాడి చేసినప్పుడు మనం అరిస్తే పక్కింటి వాళ్ళు వస్తారు కదా. చిన్న ఉదాహరణ అంతే తలుపు దగ్గరికి వెళ్లి గట్టిగా అరిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు సైలెంట్ గా ఉంటేనే కదా ఏమీ తెలియదు. కానీ రేప్ అంటూ మనం ఏదో ముద్ర వేసి మనం మాట్లాడటం అనేది ఇన్నేళ్లుగా జరగనిది ఇప్పుడు జరుగుతుందంటే ఎందుకో నాకు ఇది తేడాగా అనిపించి చెబుతున్నాను. ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ఈ విషయం మీద కనుక్కొని చెబుతానన్నారు, వాళ్ళ త్వరగా కనుక్కొని చెబితే మంచిది. ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది అక్కడ ఆ అబ్బాయి ఎవరో నాకు సంబంధం లేదు. నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటాను. ఈ అబ్బాయికి ఇప్పుడే నేషనల్ అవార్డు వచ్చింది. బాగున్నాడు, మే బి అతని మీద జలసీతో ఎవరైనా చేస్తున్నారా? వాళ్ళది అనుకున్నది దొరకనప్పుడు వేరే యాంగిల్ లో ఏమైనా చేస్తున్నారా అనేది మనకు తెలియదు అని ఆమె అన్నారు.