West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
- ఫల్తా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభం..
- మమతా మేనల్లుడిని కుంచకోటపై బీజేపీ చూపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Re-Poll: పశ్చిమ బెంగాల్లో ఫల్తా నియోజకవర్గానికి నిర్వహించిన రీ పోలింగ్ ఫలితం ఈ రోజుతో తెలియబోతోంది. మే 21న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 86.11 శాతం ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 29న ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఈవీఎంలపై బీజేపీ గుర్తు కనిపించకుండా స్టిక్కర్స్ అంటించడం, చాలా పోలింగ్ బూతుల్లో లైవ్ వీడియో ప్రసారాలు వెల్లకుండా సీసీటీవీ కనెక్షన్లను కట్ చేయడం వంటి ఆరోపణలతో ఎన్నికల సంఘం రీ-పోలింగ్‌కు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో జరిగిన రీపోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫల్తా నియోజకవర్గంలో గెలుపు బీజేపీకి చాలా కీలకంగా మారనుంది. అందుకే కాషాయం పార్టీ ఈ గెలుపు కోసం ఎదురుచూస్తోంది. ఓటింగ్‌కు ముందే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. టీఎంసీ రేసు నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా మధ్య పోటీ నెలకొంది. సీపీఎం నునంచి శంభునాథ్ కుర్మీ పోటీలో ఉన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
వివాదాస్పదమైన ఫల్తా అసెంబ్లీలో గెలుపు బీజేపీకి చాలా ముఖ్యం. టీఎంసీ కీలక నేత, మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎంపీ సీటు పరిధిలోనే ఫల్తా నియోజకవర్గం ఉంటుంది. చాలా కాలంగా ఈ సీటు టీఎంసీకి కంచుకోటగా ఉంది. దీంతో ఈ కోటను బద్ధలు కొట్టాలని బీజేపీ భావిస్తోంది.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!