దీదీ ఢిల్లీ బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్‌కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, బీఎస్‌ఎఫ్ అధికార పరిధి పెంచడం వంటి పలు అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది… కాగా, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల పరిధిని పెంచుతూ కేంద్రం బీఎస్‌ఎఫ్‌కు అధికారం ఇచ్చిన విషయం తెలిసిందే.. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దీదీ.. కేంద్రం చర్యలను తప్పుబట్టారు.. ప్రధానికి ఇప్పటికే లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ప్రత్యక్షంగా సమావేశమయ్యే సందర్భంలోనూ ఈ విషయాన్ని లేవనెత్తుతారని చెబుతారు.
Read Also: ‘బెస్ట్ టూరిజం విలేజ్’ మన భూదాన్‌పోచంపల్లి..
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
అయితే, ప్రధాని నరేంద్ర మోడీతో దీదీ మీటింగ్ అసలు ఉంటుందా? అనే చర్చ కూడా సాగుతోంది.. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడే మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలతో ఎప్పుడో చెడింది.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో వచ్చిన గ్యాప్.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడి మళ్లీ దీదీ పీఠం ఎక్కిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది.. బెంగాల్ రాజకీయాల్లో గవర్నర్ ద్వారా కేంద్రం జోక్యం చేసుకుంటుందని దీదీ మండిపడుతూ వస్తున్నారు.. ఏకంగా ప్రధాని సమీక్షలకు కూడా డుమ్మా కొట్టిన సందర్భాలు చర్చగా మారాయి.. ఈ నేపథ్యంలో.. దీదీ-మోడీ భేటీ ఉంటుందా? లేదా? అనే చర్చ కూడా సాగుతోంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!