UP: వీడేం పెళ్లికొడుకు.. వధువు స్నేహితురాలి మెడలో దండేసిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- వధువు స్నేహితురాలి మెడలో దండేసిన వరుడు
- పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయిన వధువు
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే ఎంత సంతోషం.. ఉల్లాసం ఉంటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారంటే.. అబ్బాయి-అమ్మాయికి ఎన్నో ఊహాలు ఉంటాయి. భార్యాభర్తలు అయ్యాక.. ఎన్నో ప్రణాళికలు.. ఎన్నో కలలు ఉంటాయి. అలాంటిది పెళ్లి కాక ముందే.. ఓ వరుడు చేసిన పనులకు వధువు అసహ్యించుకుని పెళ్లి పీటల మీద నుంచి దిగి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.
ఇది కూడా చదవండి: Pakistan : పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎందుకు సోమవారం బ్లాక్ డేగా మారింది ?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
బరేలీలో 26 ఏళ్ల యువకుడు రవీంద్ర కుమార్, 21 ఏళ్ల యువతి రాధా దేవికి వివాహం నిశ్చియమైంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల రాకతో మండపం అంతా ఉల్లాసంగా.. సంతోషంగా ఉంది. అయితే పెళ్లికొడుకు రవీంద్ర కుమార్.. తన గ్రామమైన నౌఘ్వా భగవంత్‌పూర్ నుంచి వచ్చే ముందు స్నేహితులతో కలిసి ఫుల్‌గా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులోనే పెళ్లి మండపానికి వచ్చాడు. అయితే పెళ్లి వేదికపై దండలు మార్చుకునే సమయం వచ్చినప్పుడు.. వరుడు రవీంద్ర కుమార్.. పెళ్లికూతురు మెడలో దండ వేయకుండా.. ఆమె స్నేహితురాలి మెడలో దండ వేశాడు. ఈ పరిణామంతో రాధ దేవితో పాటు.. అతిథులంతా షాక్ అయ్యారు. కనీసం రవీంద్ర కుమార్ స్పృహ లేడు.. ఏం చేస్తున్నాడో అతడికే అర్థం కాలేదు. వెంటనే దండ తీసి.. మరొకరి మెడలో దండ వేశాడు. దీంతో పెళ్లికూతురు నిశ్చేష్టురాలై.. పెళ్లికొడుకును చెంప దెబ్బ కొట్టి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయింది.
ఇక పెళ్లికూతురు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. వరుడు రవీంద్ర కుమార్‌ను అరెస్ట్ చేశారు. వరకట్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే వివాహ ఏర్పాట్ల కోసం రూ.10లక్షలు ఖర్చు చేసినట్లు రాధా దేవి సోదరుడు ఓంకార్ వర్మ తెలిపాడు. కట్నం పట్ల వరుడు అసంతృప్తిగా ఉన్నాడని.. ఆ ఉద్దేశంతోనే ఇలా చేశాడని వాపోయాడు. ఇక రవీంద్ర కుమార్ తన వృప్తి పట్ల కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడని పేర్కొన్నారు. ఇక వరుడు రవీంద్ర కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పరీక్షించగా మద్యం మత్తులో ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే తప్పైందని వరుడు క్షమాపణ చెప్పినా.. పెళ్లి చేసుకునేందుకు వధువు అంగీకరించలేదు. దీంతో పెళ్లి రద్దైంది.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. హస్తానికి బై చెప్పినట్టేనా..!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?