పెళ్లంటే ఎంత సంతోషం.. ఉల్లాసం ఉంటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారంటే.. అబ్బాయి-అమ్మాయికి ఎన్నో ఊహాలు ఉంటాయి. భార్యాభర్తలు అయ్యాక.. ఎన్నో ప్రణాళికలు.. ఎన్నో కలలు ఉంటాయి. అలాంటిది పెళ్లి కాక ముందే.. ఓ వరుడు చేసిన పనులకు వధువు అసహ్యించుకుని పెళ్లి పీటల మీద నుంచి దిగి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.