ఎవరైనా దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు.. కానీ, పోలీస్ స్టేషన్‌లోనే దొంగలు పడితే పరిస్థితి ఏంటి? ఇక, పోలీసులు ధరించే ఖాకీ యూనిఫాం చూస్తేనే చాలా మంది హడలిపోతారు.. కానీ, ఇక్కడ ఆ దొంగ యూనీఫాం కూడా ఎత్తుకెళ్లారు…. పోలీసుల తుపాకీని కూడా కొట్టేశారు.. పది కాట్రిజ్‌లును కూడా దొంగిలించాడు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనే కలకలం రేపుతోన్న ఈ దొంగతనం ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది..
Read Also: Rs 2,000 notes: మరోసారి రూ.2000 నోట్లపై రచ్చ.. క్లారిటీ ఇదిగో..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌లోని న్యూ ఆజాద్ నగర్ పరిధిలోని బిద్నూ ఔట్‌పోస్టులో గత రాత్రి దొంగతనం జరిగింది.. పోలీసు తుపాకీతో పాటు యూనిఫాంను ఎత్తుకెళ్లారు. అయితే, తుపాకీ కనింపించకపోవడంతో.. ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ సుధాకర్ పాండేపై కేసు నమోదు చేశారు.. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల వరకు వెళ్లింది.. దీంతో.. సుధారక్ పాండేను సస్పెండ్ చేశారు ఆ జిల్లా ఎస్పీ.. ఇక, పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు.. తుపాకీతోపాటు యూనీఫాం, పది కాట్రిజ్‌లు కనిపించకుండా పోయాయని గుర్తించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.. గురువారం ఉదయం జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ, ఫోరెన్సిక్ బృందం సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
సమాచారం ప్రకారం, సబ్-ఇన్‌స్పెక్టర్ సుధాకర్ పాండే న్యూ ఆజాద్ నగర్ చౌకీకి పోస్ట్-ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. నిన్న అర్థరాత్రి దొంగలు పోస్ట్‌లో ఉన్న పెట్టెను అపహరించి పారిపోయారు. చోరీ జరిగిన విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. హడావుడిగా ఐజీ రేంజ్, ఎస్పీ ఔటర్ సహా సర్కిల్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఫోరెన్సిక్ బృందాన్ని వెంటనే సంఘటనా స్థలానికి రప్పించారు. ఈ దొంగతనం సమయంలో, అవుట్‌పోస్ట్‌లో ఉన్న అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ సుధాకర్ పాండే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశారు. ఇక, నిందితులను పట్టుకోవడానికి ఐదు బృందాలను రంగంలోకి దించారు.