Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు జవాన్లు అమరులైనట్లు వెల్లడించారు DGMO రాజీవ్ ఘాయ్.. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై తొలిసారి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ DGMOలు సంయుక్త మీడియా సమావేశం.. నిర్వహించారు.. అందులో DGMO రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. ఐదుగురు జవాన్లు, పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం తెలియజేస్తున్నాం.. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు అన్నారు.. ఇక, ఆపరేషన్ సిందూర్‌లో మనం 5 మంది సైనికులను కోల్పోతే.. మే 7 నుంచి 10 మధ్య నియంత్రణ రేఖ వద్ద ఫిరంగి, చిన్న ఆయుధాల కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యం సుమారు 35 నుండి 40 మంది సిబ్బందిని కోల్పోయిందని పేర్కొన్నారు.
Read Also: Indian Navy: కరాచీతో సహా చాలా లక్ష్యాలను ఇండియన్ నేవీ టార్గెట్ చేసింది..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్.. పాక్ ఆక్రమిత-కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి మే 7 ప్రారంభంలో ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాం.. పాకిస్తాన్ దాడులకు తదుపరి ప్రతీకార చర్యలన్నీ ‘ఆపరేషన్ సిందూర్’ కిందే జరిగాయని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.. మా లక్ష్యాలు ఉగ్రవాద శిబిరాలు.. వారు మా మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు చేశాం.. మా లక్ష్యాలన్నింటినీ అందుకున్నాం.. పైలట్స్ అందరూ తిరిగివచ్చారని స్పష్టం చేశారు.. భారత్ పైలట్‌ను పట్టుకున్నామన్న పాకిస్తాన్ ప్రచారం నిజంకాదని కొట్టిపారేశారు.. భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ శనివారం కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. ఇప్పటికీ పాక్‌ను నమ్మలేం.. కానీ, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఏమవుతుందో వాళ్లకు తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు DGMO రాజీవ్ ఘాయ్.. ఈ రాత్రి లేదా తరువాత కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే, దానికి తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్..
