Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. న్యూయార్క్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. గతేడాది బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనను, షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అన్నారు.
Delhi: బంగ్లాదేశ్ హిందువులపై అకృత్యాలు జరుగుతున్న నేపథ్యంలో హజ్రల్ నిజాముద్దీన్ దర్గా ప్రాంతంలోని మతపెద్దలు, నివాసితుల ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను గుర్తించి స్వదేశానికి పంపించేందుకు స్పెషల్ డ్రైవ్‌ని చేపట్టాలని కోరినట్లు రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.