Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం ఉదయం పర్యాటకులు బైసారన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘‘లష్కరే తోయిబా’’ ప్రాక్సీ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
Read Also: Assam: ‘లుంగీ’ vs ‘గాడ్సే రివాల్వర్’.. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ పంచాయతీ..
పహల్గామ్ దాడిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఇది ‘‘పిరికితనం, నీచమైన’’ చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి పాల్పడిన వారు జంతువులు అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలా ఉంటే, ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.