Operation Sindoor: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పీఎం షెహబాజ్ షరీఫ్ అడ్డానే కొట్టి వచ్చాం..
- పాకిస్తాన్ పంజాబ్‌పై దాడి..
- ఆర్మీకి, ప్రధాని షరీఫ్‌కి నేరుగా వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి భారత్ దిమ్మతిరిగే రీతిలో జవాబు ఇచ్చింది. గత నెలలో పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్లో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మతం ఆధారంగా హిందువులను టార్గెట్ చేస్తూ కాల్చి చంపారు. ఈ దాడికి కారణమైన ఉగ్రవాదం, దానికి మద్దతు ఇస్తున్న పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు బలంగా కోరుకున్నారు.
ప్రజల మనోభీష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల్ని వణికించింది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడులు చేసింది. హామర్, స్కాల్ప్ మిసైళ్లతో విరుచుకుడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి శిక్షణ శిబిరాలను నాశనం చేసింది.
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ఈ దాడి ఎంతో ప్రత్యేకం:
అయితే, గతంతో పోలిస్తే ఈసారి పాకిస్తాన్లో దూరి మరీ భారత్ లక్ష్యాలను కొట్టి వచ్చింది. గతంలో పీఓకేలో ఉగ్రవాదుల్ని అణిచివేసిన భారత్, ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుల్లోని సియాల్కోట్, మురిడ్కేలతో పాటు సరిహద్దులకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్ వంటి ప్రాంతాలను టార్గెట్ చేసింది. బహవల్పూర్ జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్, దీని చీఫ్ మసూద్ అజార్ కూడా ఇక్కడే ఉంటాడు. ఈ ఉగ్రవాదిని టార్గెట్ చేస్తూ భారత్ తీవ్ర దాడులు జరిపింది. మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది ఈ దాడుల్లో హతమయ్యారు.
పాక్ ఆర్మీ చీఫ్, పీఎం షహబాజ్ షరీఫ్‌లకు వార్నింగ్..
ఈ దాడుల ద్వారా భారత్ పాకిస్తాన్‌కి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. మీరు ఉగ్రవాదానికి పాల్పడితే పాకిస్తాన్లోకి దూరి మరీ విధ్వంసం సృష్టిస్తామని చెప్పింది. గతంలో బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని బాలాకోట్ ఉగ్ర శిబిరంపై దాడి చేయడం, ఇప్పుడు పంజాబ్ ప్రావిన్సులోని పలు ప్రాంతాల్లో దాడి చేయడానికి చాలా తేడా ఉంది.
నిజానికి పాకిస్తాన్లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులు ఉన్నప్పటికీ పాక్ పరిపాలన, సైన్యం అంతా పంజాబ్‌కి చెందిన వారే ఉంటారు. రాజకీయ నాయకత్వం, సైన్యాధికారులు పంజాబీలే. ఇప్పుడు భారత్ పంజాబ్‌పై దాడి చేయడం చూస్తే, నేరుగా వీరినే ఛాలెంజ్ చేసినట్లు అవుతుంది. పాకిస్తాన్ మొత్తం పంజాబ్ అస్థి్త్వంపైనే ఆధారపడి ఉంది. ఆ దేశంలో ఒక్క పంజాబ్ ప్రజలు మాత్రమే పాకిస్తాన్ గురించి ఆలోచిస్తుంటారు. మిగతా మూడు ప్రావిన్సులు వారిలో పాకిస్తాన్ దేశం అనే భావన ఉండదు. పంజాబీల విపరీతమైన డామినేషన్ కూడా ఇందుకు ఓ కారణం. ఇప్పుడు భారత్ తన సరిహద్దు నుంచి పాక్ పంజాబ్ లోని 100 కి.మీ దూరంలోని బహవల్పూర్లో దాడి చేయడం పాక్ పాలనలకు గట్టి హెచ్చరిక అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!