Uttar Pradesh: బీజేపీ లీడర్ భర్తను చితకబాదిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samajwadi MLA Thrashes BJP Leader’s Husband: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యే అధికార బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలి భర్తను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేశారు.
Read Also: PVT04: వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్!
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ తో పాటు ఆయన అనుచరులు దీపక్ సింగ్ పై దాడి చేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. గొడవను ఆపేందుకు పోలీసులు ఇరు వర్గాలను విడదీసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఎస్పీ ఎమ్మెల్యే చెప్పిన వివరాల ప్రకారం.. దీపక్ సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత అక్కడే నిరసనలో కూర్చున్న తనని అసభ్యంగా తిట్టాడని, అందుకే తాను సహనం కోల్పోయి దాడి చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
దీపక్ సింగ్ తో పాటు అతని మద్దతుదారులు, తన మద్దతుదారులపై దాడి చేసినందుకు నిరసనకు దిగానని, అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ ఆరోపించారు. ఈ నిరసనలు జరుగుతున్న సమయంలోనే దీపక్ సింగ్ గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వస్తూనే దీపక్ సింగ్ ఎమ్మెల్యేను, అతని మద్దతుదారులను తిట్టడం రికార్డ్ అయింది. ఆ తరువాత గొడవ ప్రారంభం అయింది. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇద్దరు నేతలకు సర్దిచెప్పడానికి కష్టపడ్డామని, ఇద్దరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Warning: Disturbing video, abusive content
Inside Gauriganj Kotwali police station in UP's Amethi district. Samajwadi Party MLA Rakesh Pratap Singh and his supporters attack Deepak Singh, husband of Nagar Palika chairman BJP candidate Rashmi Singh. pic.twitter.com/BcJGQEMzGY
— Piyush Rai (@Benarasiyaa) May 10, 2023
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!