Rohit Sharma Another Worst Record In IPL: ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారుగా! ఒక్క అర్థశతకం మినహాయిస్తే, చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏమీ అతడు ఆడలేదు. డకౌట్స్ లేదా సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితం అవుతున్నాడు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ.. 8 బంతుల్లో కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. వనిందు హసరంగ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు ముందుకొచ్చి, ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
Naveen Ul Haq: చిల్లర వేషాలు మానుకోకపోతే.. అడ్రస్ లేకుండా పోతావ్
ఈ క్రమంలోనే రోహిత్ తన పేరిట అత్యంత చెత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితం అవడం.. రోహిత్‌కు ఇదే తొలిసారి. గత ఐదు మ్యాచ్‌ల్లో రోహిత్ వరుసగా 2,3,0,0,7 స్కోర్లు నమోదు చేశాడు. ఇంతకుముందు 2017లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన రోహిత్.. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ పరుగులే చేసి, తన రికార్డ్‌ని తానే బద్దలుకొట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ డకౌట్‌గా వెనుదిరిగడంతో.. ఐపీఎల్‌లో అత్యధికసార్లు (16 సార్లు) డకౌట్ అయిన ప్లేయర్‌గానూ అతడు చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో రోహిత్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. 11 మ్యాచ్‌ల్లో 191 పరుగులే చేశాడు. అందులో ఒక అర్థశతకం ఉంది.
Pawan Kalyan: కొంచెం ఊపిరి పీల్చుకొనే టైమ్ అన్నా ఇవ్వండన్నా.. చంపేస్తారా
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (68), డు ప్లెసిస్ (65), దినేశ్ కార్తిక్ (30) రాణించడంతో.. ఆర్సీబీ అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. 16.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ (83), నేహాల్ (52), ఇషాన్ కిషన్ (42) ఊచకోత కోయడం వల్లే.. ముంబై అంత భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే ఛేధించగలిగింది. ఈ విజయంతో.. ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డ్ గెలుచుకున్నాడు.