Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..
- స్వదేశీ యాంటీ-డ్రోన్ వ్యవస్థ ‘‘భార్గవాస్త్ర’’ ట్రయల్స్ విజయం..
- శత్రు దేశ డ్రోన్లు, డ్రోన్ స్వార్మ్కు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhargavastra: డ్రోన్లు, డ్రోన్ స్వార్మ్(గుంపులుగా వచ్చే డ్రోన్లు)లకు చెక్ పెట్టేలా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ద్వారా ఎదురయ్యే వేగంగా మారుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు రూపొందించిన స్వదేశీ ‘భార్గవాస్త్ర’ (Bhargavastra) కౌంటర్-డ్రోన్ వ్యవస్థ ట్రయల్ టెస్టులు సక్సెస్ అయ్యాయి. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన,వాహనంపై అమర్చే విధంగా రూపుదిద్దుకున్న కౌంటర్-స్వార్మ్ డ్రోన్ వ్యవస్థ ఇదే కావడం గమనార్హం.
‘సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL)’ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ పరీక్షలు నవంబర్ 20 నుంచి 24 వరకు జరిగాయి. శత్రువుల నుంచి గుంపులుగా వచ్చే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వ్యవస్థను రూపొందించారు.
Also Read
- Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
- Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ ఒక్కరూ జర్నలిస్ట్ కాదు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ!
- Asaduddin Owaisi: ముస్లిం వ్యక్తే డిప్యూటీ సీఎం..!
- SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
రెండు అంచెల రక్షణ..
భార్గవాస్త్ర మొబైల్, మల్లీ లేయర్డర్ రక్షణ వ్యవస్థ. ఇది శత్రు డ్రోన్లు, ఆయుధాలు కలిగిన మానవరహిత వైమానిక వాహనాలు (UAVs), లోయిటరింగ్ మ్యూనిషన్స్, స్వయంచాలక (autonomous) డ్రోన్ స్వార్మ్‌లను ధ్వంసం చేయగలదు. గగనతల ముప్పును అడ్డుకుని నాశనం చేయడాని ఇది అన్ గైడెడ్ రాకెట్లు, ప్రెసిషన్ మైక్రో మిస్సైళ్లను ప్రయోగిస్తుంది. దీని రెండంచెల డిజైన్ విభిన్న రకాల డ్రోన్ల ముప్పును ఎదుర్కోగలదు.
కమ్యూనికేషన్ సిగ్నళ్లను జామ్ చేయడం లేదా నావిగేషన్ వ్యవస్థలను దెబ్బతీయడం వంటి ఎలక్ట్రానిక్ పద్ధతులపై కాకుండా, శత్రు డ్రోన్లను భౌతికంగా నాశనం చేసే ‘హార్డ్-కిల్’ (hard-kill) విధానాన్ని కలిగి ఉంటుంది. ఎడారులు, మైదానాలు, సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తు వరకు ఉండే ఎత్తైన ప్రాంతాలతో సహా విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దారు. తద్వారా భారత్‌లోని విభిన్న సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.
డ్రోన్లను ఎలా గుర్తిస్తుంది.?
భార్గవాస్త్రలోని కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు దీనికి మెదడులా పనిచేస్తుంది. గగనతలం నుంచి వచ్చే ముప్పును గుర్తగించి ట్రాక్ చేయడానికి ఇది అనేక సెన్సార్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగల రాడార్‌తో పాటు ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్ (EO/IR) నిఘా వ్యవస్థలు, ప్యాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సెన్సార్లను ఇందులో ఉన్నాయి.
డ్రోన్ లేదా డ్రోన్ స్వార్మ్‌ను గుర్తించిన వెంటనే, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఆ సమాచారాన్ని విశ్లేషించి ఆపరేటర్లకు రియల్-టైమ్ ఇమేజ్ను ఇస్కతుంది. దీని తర్వాత లాంచర్‌కు టార్గెట్లను కేటాయించి, వచ్చే డ్రోన్లపై తక్షణమే స్పందించేలా చేస్తుంది. పెద్ద సంఖ్యలో దూసుకువచ్చే డ్రోన్ స్వార్మ్‌లను గుర్తిస్తుంది. భారత సాయుధ దళాల ‘కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ అండ్ ఇంటెలిజెన్స్ (C4I)’ నెట్‌వర్క్‌లతో అనుసంధానమయ్యేలా దీన్ని రూపొందించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..
-
Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
-
AP Local Body Elections: ఎన్నికల అనంతరం అలర్ట్.. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.. డీజీపీ కీలక ప్రకటన
-
Constitution Day: కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు: అనురాగ్ ఠాకూర్
-
Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!