ఫ్రీగా వస్తే కండోములు కూడా కావాలంటారు అంటూ ఓ మహిళా ఐఏఎస్ అధికారి చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి… ఇంతకీ.. ఆమె ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయానికి వస్తే.. బీహార్‌లోని పాట్నాలో విద్యార్థులతో ‘శశక్త్ బేటీ.. సమృద్ధ్ బీహార్’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు బీహార్ ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్‌జోత్ కౌర్… అయితే, ఓ విద్యార్థిని నుంచి ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.. విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, సైకిళ్లు వంటివి ఇస్తోంది.. వారి కోసం ఇంత చేస్తున్న సర్కార్.. రూ. 20-30 విలువ చేసే శానిటరీ నాప్‌కిన్స్‌ను ఫ్రీగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది.. ఇక, విద్యార్థిని ప్రశ్నపై తీవ్రంగా స్పందించారు హర్‌జోత్ కౌర్.. కోరికలకు అంతు ఉండక్కర్లేదా? అని వార్నింగ్ ఇస్తూనే.. ఈ రోజు నాప్‌కిన్స్ అడుగుతున్నారని ఇస్తే.. చివరికి కుటుంబ నియంత్రణ కోసం కండోములను కూడా ఉచితంగా ఇమ్మంటారంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Airtel Micro ATM: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్.. ఇక కొత్త సేవలు..
ఇక, హర్‌జోత్ కౌర్ చేసిన వ్యాఖ్యలతో అక్కడున్న విద్యార్థినులు బిత్తరపోయారు. ఇక, ఓట్ల కోసం వచ్చినప్పుడు హామీలు ఇస్తారు కదా? అని మరో ప్రశ్న వేశారు విద్యార్థిని.. దీనిపై కూడా ఆమె తీవ్రంగానే స్పందించారు. అయితే ఓట్లు వేయొద్దు. పాకిస్థాన్‌లా మారిపోండి అంటూ మండిపడ్డారు.. మరోవైపు.. ఒక విద్యార్థి తన పాఠశాలలో బాలికల మరుగుదొడ్డి విరిగిపోయిందని మరియు అబ్బాయిలు తరచూ లోపలికి ప్రవేశిస్తారని చెప్పినప్పుడు.. చెప్పండి, మీకు ఇంట్లో ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయా? మీరు వేర్వేరు ప్రదేశాలలో చాలా విషయాలు అడుగుతూ ఉంటే, అది ఎలా పని చేస్తుంది? అంటూ ఎదురు ప్రశ్నించారు.. ప్రభుత్వ పథకాలు ఎందుకు ఉన్నాయని ప్రేక్షకులు వ్యంగ్యంగా ప్రశ్నించడంతో .. ఆలోచనలో మార్పు రావాలి.. అంటూ మళ్లీ వేదికపై ఉన్న అమ్మాయిల వైపు తిరిగి.. భవిష్యత్తులో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలి.. ఈ నిర్ణయం మీరే తీసుకోవాలి. ప్రభుత్వం చేతకాదు. నీ కోసం ఇలా చెయ్యి. నువ్వు ఎక్కడ కూర్చున్నానో, లేక నేను కూర్చున్న వైపునో కూర్చోవాలా? అంటూ మండిపడ్డారు..
అయితే, ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారిని.. ఇలా నోరు జారడం.. విద్యార్థులకు సరైన రీతిలో సమాధానాలు చెప్పాల్సింది పోయి.. ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.. శ్రీమతి హర్‌జోత్ కౌర్ చేసినా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఆమె కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు..