Viral news: భార్యను చదివించిన భర్త.. జాబ్ వచ్చాక వదిలేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో మహిళలు మహా ముదురులు అవుతున్నారు.. ఇప్పటికి కొందరు మహిళలు భర్తను దైవంగా భావిస్తున్నారు.. మరి కొందరు మహిళలు భర్తను వదిలేసి వేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు లోకి వచ్చింది.. భార్య పై ఓ వ్యక్తి ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు.. ఆమె అడిగితే ఏదైనా కాదనకుండా ఇచ్చేవాడు.. అలా ఆమెకు ఇష్టమైన చదువును చదివించాడు.. అదే అతను చేసిన పెద్ద తప్పు అని ఇప్పటికి అతనికి అర్థమైంది.. ఉద్యోగం వచ్చాక భర్తను వదిలేసి వేరే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తనే వదిలేసింది.. ఈ విషయాన్ని భర్త చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..
వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది..ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలోక్ మౌర్య అనే వ్యక్తి తన భార్య జ్యోతి కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. వచ్చిన ప్రతీ రూపాయి కూడబెట్టాడు, పైగా కొంత అప్పు కూడా చేశాడు. ఇలా ఓ కోచింగ్ సెంటర్లో చేర్పించి తన భార్యను చదివించాడు. చివరికి ఆమె కూడా ఆ పరీక్షలో పాస్ అయ్యి.. సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ పోస్టు సాధించింది. కట్ చేస్తే.. తన భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న అతడి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. భర్తపై చులకన భావం పెరిగింది. అంతేకాదు.. ఏకంగా మరో అఫీసర్‌తో వివాహేతర సంబంధాన్ని కూడా పెట్టుకుంది..
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఆ విషయం కాస్త భర్తకు తెలియడంతో ఆమెను నిలదీసాడు.. దానికి అతనితో గొడవ పెట్టుకోవడం మాత్రమే కాదు..అతడిపై వరకట్నం కేసు పెట్టి జైలుపాలు చేసింది జ్యోతి. అనంతరం కొద్దిరోజులకు బెయిల్‌పై బయటకొచ్చాడు అలోక్. తన పరువుతో పాటు ఉద్యోగం కూడా పోయిందని మీడియా ముందు వాపోయాడు. విడాకులు ఇవ్వాలంటూ జ్యోతి తనను వేధింపులకు గురి చేస్తోందని, ఆమె ఫిర్యాదు చేసినా.. ఎవరూ తన గోడు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు..ఇందుకు సంబందించిన వీడియో వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది..
पति ने बीवी को पढ़ा-लिखाकर बनाया SDM,मैडम ने होमगार्ड कमांडेंट से चलाया अफेयर, हस्बैंड ने दिखाए सबूत
Story- @varnitavajpayee pic.twitter.com/O5i7BwNIoL— CrimeTak.in (@CrimeTakBrand) June 22, 2023
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!