తమిళ సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్నిరోజులు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకున్నారు .. ఇటీవలే ఆయన కోలుకొని తిరిగి ఇంటివచ్చారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తుంది… ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే ఆయన ఉంటున్నారు.. పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి చూసుకుంటున్నారు.. తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి హాజరయ్యారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల నేపధ్యంలో డీఎండీకె వర్కింగ్ కమిటీ, జనరల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పాల్గొన్నారు.. అదేవిధంగా డీఎండీకె జనరల్ సెక్రటరీగా ప్రేమలత విజయకాంత్ నియమితులయ్యారు.. ఈ సమావేశంలో పార్టీ అభివృద్ధికి సంబందించిన విషయాలను చర్చించారు..
ఈ సమావేశంలో ముఖ్యంగా 15 తీర్మానాలను ఆమోదించారు. వాటిలో విజయకాంత్ ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.. ఈ సమావేశానికి హాజరైన విజయ్ కాంత్ ను చూసి అక్కడకు వచ్చిన కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
#WATCH | தேமுதிக பொதுக்குழு மேடையில் விஜயகாந்தை பார்த்ததும் கண்ணீர் சிந்திய பெண் நிர்வாகி!#SunNews | #DMDK | #Vijayakanth | #PremalathaVijayakanth pic.twitter.com/xuuwCfpQVF
— Sun News (@sunnewstamil) December 14, 2023