Anant ambani wedding: డ్యాన్స్‌తో అలరించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్‌ సెనా

  • డ్యాన్స్‌తో అలరించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్‌ సెనా
  • సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేసిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్
John Sena

John Sena

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్‌ సెనా డ్యాన్స్‌లతో అలరించారు. బ్యాండ్‌మేళం డ్రమ్ములు వాయిస్తుండగా సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Anant ambani wedding: రాధిక గురించి అత్తగారు నీతా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్

మాజీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) స్టార్ జాన్ సెనా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహానికి వచ్చారు. వివాహ వేదికపై ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక పెళ్లి వేడుకల్లో భాగంగా జాన్ సెనా తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వైరల్ అయిన వీడియోలో సీనా నీలిరంగు దుస్తులతో పాటు తలపాగా ధరించాడు.

ఇది కూడా చదవండి: Anant ambani wedding: షెర్వానీ, స్పోర్ట్స్ షూస్‌తో వేదిక దగ్గరకు చేరిన అనంత్

ఇదిలా ఉంటే అంబానీ ఇంట్లో జరుగుతున్న వివాహానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా విచ్చేశారు. కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలుకు ఫోజులిచ్చారు. వీడియోగ్రాఫర్లు కూడా ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.