ఉత్తర ప్రదేశ్ లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 10 రోజుల క్రితం ఓ వ్యక్తి… తన వృద్ధ తల్లిని అజంగఢ్ నుండి బీహెచ్‌యు ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆమెను క్యాంపస్‌లో స్ట్రెచర్‌పై వదిలి పారిపోయాడు. ఆ మహిళ చాలా సేపు ఏడ్చింది. కానీ ఆ కొడుకు మాత్రం తిరిగి రాలేదు. చివరికి, ఆమె ఆరు రోజుల తర్వాత తన కుటుంబం కోసం బాధపడుతూ మరణించింది. కొడుకు చేసిన ఈ పనికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sangareddy: వైన్స్ టెండర్లలో హ్యాట్రిక్ కొట్టిన యువకుడు..
పూర్తి వివరాల్లోకి వెళితే… అజంగఢ్‌లోని అత్రౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధన్‌పూర్ గ్రామానికి చెందిన పుష్పా దేవిని (70) ఆమె పెద్ద కుమారుడు ఆనంద్ ప్రకాష్ చౌబే 10 రోజుల క్రితం అక్టోబర్ 16న బిహెచ్‌యు ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అతను ఆమెతో దాదాపు అరగంట పాటు ఉండి, ఆపై పారిపోయాడు, ఆమె నొప్పితో స్ట్రెచర్‌పై చాలా ఇబ్బంది పడింది. బిహెచ్‌యు క్యాంపస్‌లో ఒక వృద్ధ తల్లి బాధతో కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆమె పరిస్థితిని చూసి ఎవరో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమెను డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ఇఎంటి అమిత్ కుమార్ ఆమెను నాలుగో వార్డులో చేర్చి చికిత్స ప్రారంభించారు. ఐదు రోజుల తర్వాత ఆమె మరణించింది. ఈ కేసు గురించి సమాచారం అందిన వెంటనే సామాజిక కార్యకర్త అమన్ కబీర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.
Read Also:Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..!
అంతకుముందు, పోలీసులు వృద్ధ తల్లి కుమారులను వారణాసికి రమ్మని సమాచారం అందించారు.. 48 గంటల దాటినప్పటికి తల్లి మృతదేహం వద్దకు ఒక్క కొడుకు రాలేదు. చిన్న కుమారుడు విజయ్ ప్రకాష్ కూడా తన మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యలు చేసిన ఈ పని తనను ఎంతో బాధకు గురి చేసిందని అమన్ కబీర్ అన్నారు. తనతో పాటు కొత్వాలి ఎస్ ఐ చంద్రేష్ ప్రసాద్.. కానిస్టేబుల్ రవికాంత్ దూబే, మీను సింగ్ వారి కుమారులు రమ్మని ఫోన్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతకి కుమారులు రాకపోవడంతో .. అమన్ కబీర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మణి కర్ణికా ఘాట్ లో వృద్ధ మహిళ అంత్యక్రియలు నిర్వహించారు.