వ్యాక్సిన్లపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందివ్వనున్నట్టు జాతినుద్దేశించిన ప్రసంగించిన సమయంలో స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని.. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు.. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేస్తుందని.. 25 శాతం వ్యాక్సిన్ డోసులు ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.. అయితే, ప్రైవేట్ వ్యాక్సిన్‌కు కూడా ధర నిర్ణయించారు.. సొంత ఖర్చుతో వ్యాక్సినేషన్ చేయించుకునే వారికి వెసులుబాటు కల్పించామన్న ప్రధాని.. సొంత ఖర్చుతో వ్యాక్సిన్ వేయించుకునే వారు రూ.150 చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని స్పష్టం చేశారు.. ప్రధాని ప్రకటనలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. ఒక్క రూపాయి కూడా వ్యాక్సిన్లపై రాష్ట్రాలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.