Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ ఘటన.. మూడో రోజు కూడా కొనసాగతున్న సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Tunnel Collapse Update: ఉత్తరాఖండ్ టెన్నెల్ వద్ద సహాయక చర్యలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో మంగళవారం భారీ డయామీటర్ పైపులు, డ్రిల్లింగ్ యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆదివారం ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం ఆకస్మాత్తుగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రెండు రోజులుగా సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచే 900 మిల్లీమీటర్ల వ్యాసం పైపులతో కూడిన ట్రక్కులు సిల్కీయారాకు రావడం ప్రారంభించాయి.
Also Read: Asaduddin Owaisi: నువ్వు ఆర్ఎస్ఎస్ కీలుబొమ్మవి.. బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
తాజాగా భారీ డ్రిల్లింగ్ మిషన్ కూడా చేరుకోవడం సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు వీలుగా శిథిలాల మధ్య పెద్ద వ్యాసం కలిగిన ఎంఎస్ పైపులను చొప్పించడానికి ఒక యంత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న 40 మంది కార్మికుల ప్రదేశానికి చేరుకోవడానికి ఇంకా 35 మీటర్ల శిథిలాలను తొలగించాల్సి ఉందని సహాయక బృందాలు తెలిపాయి. కాగా ఈ సహాయక చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించారు. చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు.
Also Read: Gautam Singhania: భార్యతో విడిపోయిన రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా.. కారణం ఏంటంటే?
హాయక చర్యల కోసం హరిద్వార్, డెహ్రాడూన్ నుంచి పెద్ద డయామీటర్ హ్యూమ్ పైపులను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ధామి తెలిపారు. ఘటన చిక్కుకున్న 40 మంది కార్మికులు యోగ క్షేమాల గురించి తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేశారని, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 60 మీటర్ల శిథిలాల్లో 20 మీటర్లకు పైగా శిథిలాలను తొలగించామని, ఈ రోజు రాత్రి వరకు లోపల చిక్కుకున్న 40 మందిని బయటకు తీస్తామని ఉత్తరకాశీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అర్పన్ యదువంశీ చెప్పారు. వారికి ఆక్సిజన్, ఆహారం, నీరు సహా అన్ని మౌలిక సదుపాయాలను పైపుల ద్వారా కల్పిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులను కూడా సంప్రదించామని తెలిపారు.
#WATCH | Uttarkashi tunnel accident: Trucks loaded with 900 mm diameter pipes reach Silkyara. A platform is being prepared for the auger machine for horizontal drilling to rescue the trapped labourers by inserting large diameter MS pipes in the part of the Silkyara tunnel blocked… pic.twitter.com/KcGcVB2z55
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 14, 2023
తాజావార్తలు
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!