టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్ర పోషించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ‘రాబిన్ హుడ్’ ప్లాప్ అవడంతో.. ‘తమ్ముడు’ విజయం నితిన్ కెరీర్‌కి చాలా కీలకం అని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.. అయితే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్..
Also Read : ZEE 5 : కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో వస్తున్న జీ5..
ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ‘తమ్ముడు’ మూవీ టీమ్ తమదైన స్టైల్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఫిమేల్ లీడ్స్ లయ, వర్ష బొల్లమ్మ, స్వాసిక,సప్తమి గౌడ ఫన్నీ చిట్ చాట్‌తో విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్మెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.