Uttar Pradesh: కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్‌లో భోజనం.. యోగి ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food served to kabaddi players in the toilet: ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో ఆహారం అందిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 16న సహరాన్ పూర్ బాలికల అండర్ -17 రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దీన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరుగుదొడ్డిలా కనిపించే ప్రాంతంలో విద్యార్థినిలు అన్నం, కూరలు వడ్డించుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో యూరినల్స్, వాష్ బేషన్, టాయిలెట్ ఫ్లోర్ లో ఉంచిన రైస్ ప్లేట్ ను గమనించవచ్చు. ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సహరాన్‌పూర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
Read Also: Tension in Shamshabad: శంషాబాద్ లో ఉద్రిక్తత.. వైద్యం వికఠించి వ్యక్తి మృతి బంధువులు ఆందోళన
వర్షం కురుస్తున్న సమయంలో స్మిమ్మింగ్ పూల్ ఏరియాలో ఫుడ్ ఏర్పాట్లను చేశామని.. స్మిమ్మింగ్ పూల్ పక్కనే బట్టలు మార్చుకునే గదిలో ఆహార పదార్థాలను పెట్టామని.. స్టేడియంలో అక్కడక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. వర్షం కారణంగా ఆహారాన్ని ఉంచే స్థలం లేకపోవడంతో ఇలా చేశామని సస్పెండ్ అయిన అధికారి సక్సేనా వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ ఘటన రాజకీయంగా వివాదాస్పదం అయింది. కబడ్డీ ఆటగాళ్లను బీజేపీ అవమానపరిచిందంటూ విపక్షాలు విమర్శలు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్జేడీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా బీజేపీపై విమర్శలు గుప్పించాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి.. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు అందించే ఆహారాన్ని టాయిలెట్ లో ఉంచారని.. ఆటగాళ్లను బీజేపీ ఇలానే గౌరవిస్తుందా..? సిగ్గు చేసు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ నేత జయంత్ చౌదరి కూడా ఈ ఘటనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను ట్వీట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేసింది.
यूपी की कबड्डी खेलने वाली बेटियों को टॉयलेट में खाना परोसा गया।
झूठे प्रचार पर करोड़ों खर्च करने वाली BJP सरकार के पास हमारे खिलाड़ियों के लिए अच्छी व्यवस्था करने के पैसे नहीं हैं।
धिक्कार है! pic.twitter.com/UazJvCrWPB
— Congress (@INCIndia) September 20, 2022
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!