JD Vance: భారత్‌కి రాబోతున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..

  • భారత పర్యటనకు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు..
  • ఏప్రిల్ 21-24 మధ్య జేడీ వాన్స్ పర్యటన..
  • యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ నేపథ్యంలో ట్రిప్‌కి ప్రాధాన్యం..
Jd Vance

Jd Vance

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 21-24 మధ్య భారత్ సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.

Read Also: Vishwambhara vs Mass Jathara : చిరంజీవి వర్సెస్ రవితేజ.. బాక్సాఫీస్ క్లాష్ తప్పదా..?

×
×
Ad

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) మైక్ వాల్ట్జ్ కూడా వీరితో పాటు భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఉషా వాన్స్ భారత సంతతి అమెరికన్. ఆమె అమెరికా రెండో మహిళగా తన స్వదేశానికి మొదటిసారిగా వస్తోంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది.