JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. ఆయన సతీమణి భారత సంతతికి చెందిన ఉషా వాన్స్, పిల్లలతో కలిసి భారత్ వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు, భారత సంతతికి చెందిన సెకండ్ లేడీ ఉషా చిలుకూరి, వారి ముగ్గురు పిల్లలు - కుమారులు ఇవాన్, వివేక్ మరియు కుమార్తె మిరాబెల్ నాలుగు రోజుల భారతదేశ పర్యటన కోసం సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 21-24 మధ్య భారత్ సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.