IT Jobs: H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగుల కోసం తమను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు అమెరికన్ టెక్కీలు ఆరోపించడం సంచలనంగా మారింది. 20 మంది ఉద్యోగులను జాతి, వయస్సు వివక్ష ఆధారంగా తొలగించినట్లు వారు ఆరోపిస్తు్న్నారు. యూఎస్‌లో పనిచేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఈ ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.