US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- అమెరికా దాడుల్లో చాబహార్ షాహిద్ బెహెష్టి టెర్మినల్ ధ్వంసం.
- భారత్ పెట్టుబడులు పెట్టిన కీలక పోర్టుపై ప్రభావం.
- చైనా-ఇరాన్ రైల్వే కారిడార్‌లోని వంతెనపై దాడి.
- ఒకేసారి భారత్, చైనాలను దెబ్బతీసిన అమెరికా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా ఇరాన్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. హార్ముజ్‌లో స్వేచ్ఛా నౌకాయానాన్ని ఇరాన్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులు ఇరాన్‌కు మాత్రమే కాకుండా భారత్, చైనాలను కూడా దెబ్బతీస్తున్నాయి.
చాబహార్‌పై దాడి:
భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు చేసింది. భారత్‌కు ఇది ఎంతో వ్యూహాత్మక పెట్టుబడి. పాకిస్తాన్‌ను కాదని మధ్య ఆసియాలోకి భారత్ చేరేందుకు చాబహార్ పోర్టు, ఆఫ్ఘనిస్తాన్ సహాయపడుతాయి. ఇదే పోర్టుపై యూఎస్ వైమానిక దాడులకు తెగబడింది. పోర్టులోని షాహిద్ బెహెష్టి టెర్మినట్ దెబ్బతిన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. టెర్మినల్‌తో పాటు నౌకాశ్రయ నియంత్రణ టవర్, కలంతరి పోర్ట్, విద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
Also Read
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
టెర్మినల్ అభివృద్ధి కోసం భారతదేశం 2015లో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేయగా, 2024లో 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారతదేశం ఇప్పటివరకు 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, ప్రధాని మోదీ 2016లో 500 మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేశారు. 2024లో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, చాబహార్‌లోని షాహిద్ బెహెష్టి పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి కోసం ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేశారు.
చైనాకు దెబ్బే:
అమెరికా ఉత్తర ఇరాన్‌లోని ఒగ్టే ఖాన్ రైల్వే వంతెనపై క్రూయిజ్ మిస్సైళ్లలో దాడులు చేసింది. ఈ వంతెన చైనా-తుర్క్మెనిస్తాన్-ఇరాన్ రైల్వే కారిడార్‌కు చాలా కీలకమైంది.ఇరాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా, ఇరాన్‌తో ఈ మార్గం ద్వారా వాణిజ్యం చేస్తోంది. ఇదే కాకుండా ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న రష్యా కూడా 2025 నుంచి ఈ రైల్వే మార్గం ద్వారా సరుకుల రవాణా చేస్తోంది.
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..