Sergio Gor: మోడీతో భేటీ అయిన అమెరికా రాయబారి సెర్గియో గోర్..

  • ప్రధాని మోడీని కలిసిన యూఎస్ రాయబారి..
  • మోడీ, ట్రంప్‌కు గొప్ప స్నేహితుడు అని కామెంట్స్..
Modi

Modi

Sergio Gor: భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇద్దరు రక్షణ, వాణిజ్యం, సాంకేతికతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఉన్న సంతకం చేసిన ఫోటోను ఆయన ప్రధానికి బహూకరించారు. మోడీకి బహూకరించిన ఫోటోలపై ట్రంప్ ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు’’ అని రాశారు.

Read Also: Pakistan TLP: పాక్ నెత్తిన భస్మాసుర అస్త్రం.. దిక్కు తోచని స్థితిలో దాయాది

సెర్గియో గోర్‌తో భేటీ అయిన చిత్రాన్ని ప్రధాని ఎక్స్ ద్వారా షేర్ చేశారు. ‘‘ భారతదేశానికి అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్గియో గోర్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఆయన పదవీకాలం భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.’’ అని రాశారు. సమావేశం తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్, మోడీని గొప్ప, వ్యక్తిగత స్నేహితుడిగా భావిస్తారు అని అన్నారు.