Sergio Gor: భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇద్దరు రక్షణ, వాణిజ్యం, సాంకేతికతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఉన్న సంతకం చేసిన ఫోటోను ఆయన ప్రధానికి బహూకరించారు. మోడీకి బహూకరించిన ఫోటోలపై ట్రంప్ ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు’’ అని రాశారు.