Putin In India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయ్యారు. పుతిన్‌ను స్వాగతించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ, ఎయిర్ పోర్టుకు వచ్చారు. పుతిన్‌ను మోడీ ఘనంగా స్వాగతించారు.
Putin In India: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో అడుగుపెట్టారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రెండు రోజుల పాటు ఇండియా పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ఆయనను స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతించారు. పుతిన్ 23వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పుతిన్ పూర్తి షెడ్యూల్: మొదటి రోజు: * సాయంత్రం 6.35: వ్లాదిమిర్ పుతిన్ పాలం…
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. పుతిన్ పర్యటనపై రష్యా, భారత్ రెండు దేశాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఉక్రెయిన్ యుద్ధం అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
Sergio Gor: భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇద్దరు రక్షణ, వాణిజ్యం, సాంకేతికతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఉన్న సంతకం చేసిన ఫోటోను ఆయన ప్రధానికి బహూకరించారు. మోడీకి బహూకరించిన ఫోటోలపై ట్రంప్ ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు’’ అని రాశారు.
Bangladesh: భారత్‌కు పాకిస్తాన్ మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్ కూడా పక్కలో బళ్లెంతా తయారవుతోంది. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయివచ్చిన తర్వాత, అక్కడ భారత వ్యతిరేకత బాగా పెరిగింది. తాత్కిలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సర్కార్ స్పష్టంగా భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. పలు సందర్భాల్లో భారత్‌ని ఇరుకున పెట్టేలా యూనస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ , చైనాలతో దోస్తీ మన దేశానికి ఇబ్బందికరంగా మారింది.