Eric Garcetti: భారత్-అమెరికా సంబంధాల గురించి ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాకిస్తాన్, చైనాతో స్నేహం కారణంగా తమకు భారత్ దూరమైందని అన్నారు. అయితే, 2000వ దశకం నుంచి భారత్-అమెరికా సంబంధాల్లో గణనీయమైన మార్పు కనిపించిందని చెప్పారు. రెండు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలకు కీలకమైన క్షణంగా నొక్కి చెప్పారు9.
‘‘ అమెరికా చైనా, పాకిస్తాన్లను ఎన్నుకున్నందుకు గతంలో భారత్, అమెరికాకు దూరంగా ఉంది, కానీ 2000లో భారత్-యూఎస్ పౌర అణు ఒప్పందంతో సంబంధాలల్లో స్థిరమైన కదలిక ఉంది’’ అని గార్సెట్టి చెప్పారు. అణు ఒప్పందం అంతర్జాతీయ వేదికల్లో భారత్‌ని ఏకీకృతం చేయడాన్ని సులభతరం చేసిందని, ఇది భారత్ పట్ల యూఎస్ నిబద్ధతకు ప్రతీక అని రాయబారి పేర్కొన్నారు.
Read Also: Sandeshkhali: బెంగాల్ సందేశ్‌ఖాలీలో టెన్షన్.. తృణమూల్ ఎమ్మెల్యే సహాయకుడిపై దాడి..
చాలా కాలంగా, మేము బ్రిటీష్ వారి నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం కోసం మద్దతు ఇచ్చాము, మాకు గొప్ప సంబంధాలు ఉన్నాయని, మేము 70ల్లో చైనాకు అమెరికా దగ్గరా ఉండటంతో భారత దేశానికి దూరంగా వెళ్లామని, వారిని రష్యా వైపు నెట్టామని గార్సెట్టీ చెప్పారు. అమెరికా, పాకిస్తాన్‌కి సన్నిహితంగా ఉండటంతో భారత్ తమను నమ్మదగిన భాగస్వామిగా చూడలేదని అన్నారు. 2000లలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ అణు ఒప్పందంపై భారత్‌తో చర్చలు జరపడం ప్రారంభించినప్పుడు ఈ అభిప్రాయం మారిపోయిందని అన్నారు.
ప్రస్తుత పరిస్థితులపై గార్సెట్టీ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాలు ఇప్పుడు నిబద్ధతతో కూడిన సంబంధంతో సమానంగా ఉన్నాయని అన్నారు. అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు కుట్ర జరిగిందని, ఇందులో భారత అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలపై భారత్ జవాబుదారీతనం పట్ల అమెరికా సంతృప్తి వ్యక్తం చేసిందని గార్సెట్టి చెప్పారు.