Defence Deal: భారతదేశానికి 93 మిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాలను అమెరికా ఆమోదించింది. ఇరు దేశాల మధ్య భారీ డిఫెన్స్ డీల్ ఓకే అయింది. ఈ డీల్‌లో భాగంగా అమెరికా భారత్‌కు యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ రౌండ్ల కొత్త బ్యాచ్‌ను అందించేందుకు మార్గం సుగమమైంది. ఈ ప్యాకేజీలో భాగంగా 100 FGM-148 జావెలిన్ క్షిపణులు, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, 216 ఎక్స్‌కాలిబర్ ఆర్టిలరీ రౌండ్లు ఉన్నాయి. ఈ ఆయుధాల బదిలీ గురించి డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) అమెరికన్ కాంగ్రెస్‌కు తెలియజేసింది. అభ్యంతరాలు తెలపడానికి కాంగ్రెస్‌కు సమయం ఉంటుంది.
Read Also: Chhattisgarh: ఛత్తీస్గఢ్కి హిడ్మా మృతదేహం తరలింపు..
ఈ ఆయుధాల అమ్మకం భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, ముప్పును ఎదుర్కొనే భారతదేశ సామర్థ్యాలను మరింత పెంచుతుందని అమెరికా తెలిపింది. RTX, లాక్‌హీడ్ మార్టిన్ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన జావెలిన్ వ్యవస్థలు, పదాతిదళ యూనిట్లు అధిక ఖచ్చితత్వంతో సాయుధ లక్ష్యాలను సుదూర పరిధిలోని ఢీకొట్టడానికి సహకరిస్తాయి. ఎక్సాలిబర్ రౌండ్ల ఆర్టిలరీ యూనిట్లకు జీపీఎస్-గైడెడ్ ఖచ్చితత్వం ఉంటుంది. జావెలిన్ క్షిపణులు రష్యా యుద్ధంలో, ఉక్రెయిన్ వినియోగించింది. దీంతో దీని సత్తా ప్రపంచానికి తెలిసింది. రష్యన్ T-72, T-90 ట్యాంకులు వీటి ధాటికి ధ్వంసమయ్యాయి. సైనికుల భుజాల నుంచి ఈ క్షిపణులను ప్రయోగించవచ్చు.