Shocking: అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చ పెడుతున్నాయి. ముఖ్యంగా, పెళ్లి అనంతరం వేరే వ్యక్తుల మోజులో పడిన మహిళలు భర్త, పిల్లల్ని వదిలేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఏటావా జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ తన భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలేసి, ఇన్‌స్టాగ్రామ్ లవర్‌తో లేచిపోయింది. తన లవర్‌లో జీవించాలని అనుకుంటున్నానని కోర్టులో చెప్పింది. తన భర్త తాగుబోతు, జూదగాడు అని ఆరోపించింది.
దాదాపు నెల క్రితం మనీషా(25) తన ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆమె భర్త భూప్ సింగ్ మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. కేసులు దర్యాప్తు చేసిన పోలీసులు, మనీషాను కనుగొని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు, తన భర్త మద్యం సేవిస్తున్నాడని, జూదం ఆడుతున్నాడని, రాత్రిపూట అపరిచితులను ఇంటికి తీసుకువచ్చి వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నాడని సదరు మహిళ ఆరోపించింది. ఇకపై అతడితో జీవించలేనని, తన పిల్లలను కూడా తీసుకెళ్లనని ఆ మహిళ చెప్పింది.
Read Also: Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..
బదౌన్ జిల్లాకు చెందిన తన లవర్ ముఖేష్ యాదవ్ తో జీవిస్తానని స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మనీషా, ముఖేష్‌కు పరిచయం జరిగింది. వీరిద్దరి స్నేహిం చివరకు ప్రేమగా మారింది. తాను తన భర్తతో జీవించాలని అనుకోవడం లేదని, అతను తన జీవితాన్ని నరకంలా మార్చాడని ఆరోపించింది. మనీషా మామ హన్స్ రాజ్, ఆమె పిల్లలు కోర్టు వెలుపల ఏడుస్తూ వేడుకున్నప్పటికీ, మనీషా తన లవర్‌లోనే వెళ్లాలని నిర్ణయించుకుంది. కోర్టు వెలుపల ఉన్న వారు మనీషా చర్యల్ని తీవ్రంగా ఖండించారు. ఆమె తల్లి ప్రేమను మరించిందని తిట్టారు. తన కోడలు ఇన్‌స్టాగ్రామ్ లవ్ తమ ఇంటిని నాశనం చేసిందని వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని మామ హన్స్ రాజ్ డిమాండ్ చేశారు. మరోవైపు, భర్త భూప్ సింగ్ మాట్లాడుతూ.. తన భార్యను ఎవరో బ్రెయిన్ వాష్ చేశారని, నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని వాపోయారు.