ఇప్పుడున్న జనరేషన్ లో భార్యని భర్త, భర్తని భార్య చంపుకోవడం చాలా కామన్ అయిపోయింది. కొందరు భర్తలు.. ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా చనిపోతున్నారు. చిన్న చిన్న పొరపాట్లకు భార్యలు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే…..ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికెన్ వండలేదని భార్యపై దాడి చేశాడు ఓ భర్త .. దాడిని భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. అనంతరం డెడ్ బాడీని భర్త నదిలో పడేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10నెలల క్రితం రీనా అనే మహిళను నిగమ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 21న నిగమ్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన భర్త నిగమ్ భార్యను చికెన్ వండలేదా అని అడిగాడు. భార్య రీనా చికెన్ వండలేదు.. వెజిటేరియన్ కర్రీ వండాడని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నిగమ్ కోపంతో రీనాపై దాడి చేశాడు.
భర్త దాడి చేయడంతో మనస్థాపం చెందిన రీనా.. ప్రాణం తీసుకుంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిన తర్వాత నిగమ్ భయపడిపోయాడు. ఆమె బంధువులు తనపై దాడి చేస్తారని టెన్షన్ పడ్డాడు. ఈ క్రమంలో తన బంధువుల సహాయంతో రీనా డెడ్ బాడీని ఒక షీట్లో చుట్టి గంగా నదిలో పడేశాడు. ఆ తర్వాత పోలీసులు అనుమానించకుండా ఉండేందుకు తన భార్య కనిపించడం లేదని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు.
రీనా కుటుంబ సభ్యులు నిగమ్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్నం కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు వారి స్టైల్ లో విచారించడంతో నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు నిగమ్ తో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.