UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- ఉత్తరప్రదేశ్‌లో ఘోరం
- అత్తగారి అంత్యక్రియల్లో దారుణం
- నదిలో చేతులు కడుక్కుంటుండగా మొసలి దాడి
- మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి చనిపోయిందని కూతురు శోకంలో ఉంటే.. గంటల వ్యవధిలోనే కట్టుకున్న భర్త కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఓ ఆడ కూతురికి అంతులేని విషాదంగా మారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది.. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఎలా ప్రాణాలు కోల్పోయారో తెలియాలంటే ఈ విషాద వార్తను చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా నివాసి అయిన దీపక్ శర్మ (27), తన అత్తగారైన ఊర్మిళా దేవి (50) మే 19న కేన్సర్స్‌తో చనిపోయింది. దీంతో అంత్యక్రియల కోసం తన భార్య, కుమార్తెతో కలిసి గోండాలోని అత్తగారింటికి వెళ్లాడు. ఇక ఘాగ్రా నది ఒడ్డున ఊర్మిళా దేవి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత కాళ్లు.. చేతులు కడుక్కునేందుకు దీపక్ నదిలోకి దిగాడు. చేతులు కడుక్కునేందుకు వంగినప్పుడు మెరుపు వేగంతో అతి పెద్ద మొసలి అమాంతంగా దాడి చేసింది. దీపక్ తలను దవడలతో పట్టుకుని వేగంగా నదిలోకి లాక్కెళ్లిపోయింది. అందరూ చూస్తుండగానే లోపలికి తీసుకెళ్లి పోయింది. ఈ హఠాత్తు పరిణామంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
బంధువులు, కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే జనాలు ఉన్న ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మే 21న పైపు వంతెన సమీపంలో దీపక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) అజిత్ కుమార్ రజత్ మాట్లాడుతూ.. దీపక్ శర్మ తన అత్తగారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడని తెలిపారు. సోనౌలి గ్రామంలోని నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో దీపక్ చేతులు, కాళ్లు కడుక్కోవడానికి నదిలోకి వెళ్లగా ఒక భారీ మొసలి అతడిని నదిలోకి లాక్కెళ్లిందని.. మే 21వ తేదీన అతని మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఇక గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలోనూ.. గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!