మాజీ ఎంపీ, సినీనటి జయప్రదకు కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆమెను ఉత్తరప్రదేశ్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే ప్రచార సమయంలో ప్రత్యర్థి ఆజం ఖాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: Lavanya: రాజ్‌తరుణ్‌తో అరియానా ఎఫైర్.. లావణ్య సంచలన వ్యాఖ్యలు
దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం గురువారం ఆమెను నిర్దోషిగా ప్రకటించినట్లు సీనియర్ న్యాయవాది అమర్‌నాథ్ తివారీ వెల్లడించారు. న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించిన సమయంలో ఆమె కోర్టులోనే ఉన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రామ్‌పుర్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైనట్లు తెలిపారు. ఎప్పుడూ ఇక్కడే ఉంటానని.. తానేనెప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. 2004, 2009లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై రాంపూర్ నుంచి జయప్రద లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.
ఇది కూడా చదవండి: IPS Officers Transferred: ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ..