Union Minister Ashwini Choubey Convoy Car Meets Accident Bihar: ఒక ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తృటిలో తప్పించుకున్నారు. తన కాన్వాయ్‌లో ఆయన ఆదివారం రాత్రి బక్సర్ నుంచి పాట్నాకు వెళ్తున్నప్పుడు.. డుమ్రాన్‌లోని మథిలా-నారాయణపూర్ రోడ్డులో ఒక పోలీస్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులతో పాటు డ్రైవర్‌కి గాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన పోలీస్ వాహనం వెనకాలే కేంద్రమంత్రి కారు ఉంది. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే.. ఆయన కారు కూడా ప్రమాదానికి గురయ్యేది. కానీ.. అలాంటిది చోటు చేసుకోలేదు. కేంద్రమంత్రి ఈ ప్రమాదం నుంచి సురక్షితంగానే బయటపడ్డారు.
Naatu Naatu: వెస్ట్రన్ గడ్డపై మన నాటు డాన్స్ హవా…
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను చౌబే తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఇందులో ఆయన బోల్తాపడిన కారుని తనిఖీ చేయడాన్ని చూడొచ్చు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి, గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. ‘‘బక్సర్ నుంచి పాట్నాకు వెళ్లే సమయంలో.. కోరన్‌సరాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం ప్రమాదానికి గురైంది. దుమ్రావ్ మథిలా-నారాయణపూర్ రహదారి వంతెన కాలువలో బోల్తాపడింది. అయితే.. శ్రీరాముని దయవల్ల ఈ ఘటనలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగలేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన పోలీసులు, డ్రైవర్‌ను డుమ్రావ్ సదర్ ఆసుపత్రికిలో చేర్చారు’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా.. అశ్విని కుమార్ చౌబే ప్రస్తుతం కేంద్ర పర్యావరణం, అటవీ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.
Virat Kohli: శ్రీలంకపై కోహ్లీ సెంచరీ.. నమోదైన రికార్డులివి.. వరల్డ్‌లోనే తొలి ఆటగాడిగా..
बक्सर से पटना जाने के क्रम में डुमराव के मठीला-नारायणपुर पथ के सड़की पुल के नहर में कारकेड में चल रही क़ोरानसराय थाने की गाड़ी दुर्घटनाग्रस्त हो गई है। प्रभु श्रीराम की कृपा से सभी कुशल हैं। घायल पुलिसकर्मियों एवं चालक को लेकर डुमराव सदर अस्पताल जा रहा हूं। pic.twitter.com/ybTVi6jn5v
— Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) January 15, 2023