Delhi: అమిత్ షాను కలిసిన కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు
- అమిత్ షాను కలిసిన కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు
- కేసు విషయాన్ని పరిశీలిస్తామని అమిత్ షా హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు కలిశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ బాధిత కుటుంబ సభ్యులు లేఖ రాశారు. బుధవారం కలిసేందుకు అనుమతి రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు.. అమిత్ షాను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. భేటీ అనంతరం బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. అమిత్ షాను కలిసి తమ గోడు చెప్పుకున్నట్లు పేర్కొన్నారు. కోల్‌కతా కేసు విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు.
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం ఆగస్టగు 10న సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు సరిగ్గా లేకపోవడంతో కోల్‌కతా హైకోర్టు.. దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. చివరికి దర్యాప్తు సంస్థ కూడా సంజయ్‌రాయ్‌ను నిందితుడిగా పేర్కొంది. అతడు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చింది. అలాగే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ ఆఫీసర్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇక ఈ కేసు విచారణ ఈనెల 11న జరగనుంది. సంజయ్‌రాయ్‌పై కోర్టు అభియోగాలు మోపింది.
Also Read
ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వారితో చర్చలు జరిపింది. ప్రస్తుతం వైద్యులు.. విధుల్లో పాల్గొన్నారు. తమకు భద్రత కల్పించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.
North 24 Parganas, West Bengal | On meeting Union Home Minister Amit Shah, father of the victim in RG Kar rape and murder case says, "I will meet him. I had a conversation with him and he said he will look into the matter…" pic.twitter.com/CZLOOhFNyW
— ANI (@ANI) November 6, 2024
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!