Bangladesh: హిందూనేత అరెస్ట్..భారత్ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్..
- భారత్ ప్రకటన నిరాధారమైంది..
- చిన్మోయ్ అరెస్టుపై భారత ప్రకటన స్నేహ స్పూర్తికి విరుద్ధం..
- భారత్ వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మతనాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. భారత్ ఆయన అరెస్ట్‌పై, బెయిల్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలపై పోలీసుల దాడిని ఖండించింది. మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ రోజు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.
Read Also: Bangladesh: హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ తరుపున వాదిస్తున్న ముస్లిం లాయర్ హత్య..
Also Read
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
ఇదిలా ఉంటే, భారత్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. చిన్మోయ్ అరెస్ట్‌ని కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని చెప్పింది. భారత ప్రకటన ‘‘నిరాధారమైనంది’’; ’’ స్నేహ స్పూర్తి విరుద్ధం’’ అని పేర్కొంది. రెండు పొరుగు దేశాల మధ్య స్నేహం, స్పూర్తికి విరుద్ధమైనవిగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. భారత ప్రకటన బంగ్లాదేశ్‌లోని సామరస్యాన్ని ప్రతిబింబించలేదని బంగ్లాదేశ్ చెప్పింది. ప్రతీ బంగ్లాదేశ్ పౌరుడికి మతపరమైన గుర్తింపుతో సంబంధం లేకుండా మతపరమైన ఆచారాలు నిర్వహించడంలో, అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పింది. గత నెలలో దేశవ్యాప్తంగా శాంతియుతంగా దుర్గాపూజ నిర్వహించడం రుజువు చేసినట్లు ఆ దేశం చెప్పింది. బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థ “పూర్తి స్వతంత్రం” అని, న్యాయవ్యవస్థ పనిలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని పేర్కొంది.
బంగ్లాదేశ్ పోలీసులు చిన్మోయ్ కృష్ణదాస్‌ని దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసింది. ఆయన రాజధాని ఢాకా నుంచి చిట్టోగ్రామ్ వెళ్లే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!