Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మతనాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. భారత్ ఆయన అరెస్ట్‌పై, బెయిల్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలపై పోలీసుల దాడిని ఖండించింది. మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ రోజు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.