Aadhaar Card: టెన్షన్ లేదు.. మేజర్ అయితే ఆటోమేటిగ్గా ఆధార్ అప్ డేట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ ను ఒక వ్యక్తి పుట్టుక నుంచి, మరణం వరకు అన్నింటికీ అనుసంధానించే ప్రణాళికతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉంది. పుట్టిన వెంటనే శిశువుల పేరుతో ఆటోమేటిగ్గా తాత్కాలిక ఆధార్ జారీ అవుతుంది. వారు మేజర్లు అయిన తర్వాత వేలిముద్రలతో అప్ డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు త్వరలోనే రెండు పైలట్ కార్యక్రమాలను ఆరంభించనుంది. ఈ వివరాలను యూఐడీఏఐకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
2010లో ఆధార్ ఆవిష్కరించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా పెద్దలు అందరికీ ఆధార్ జారీ అయింది. ఇక మీదట జన్మించిన దగ్గర్నుంచి, మరణించే వరకు వ్యక్తులకు సంబంధించి అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే యోచనతో యూఐడీఏఐ ఉంది. మరణ రికార్డులతోనూ ఆధార్ డేటాను అనుసంధానించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ఉద్దేశ్యం.
Also Read
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- Accidnet: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
- Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
- Gyanesh Kumar: ప్రపంచంలోనే భారత్‌లో విశ్వసనీయమైన ‘సర్’ నిర్వహిస్తున్నాం
“పిల్లలకు కనీసం ఐదేళ్లు ఉంటేనే వేలిముద్రలు తీసుకుంటారు. ఐదేళ్లు నిండిన పిల్లల ఇంటికి మా బృందాలే వెళ్లి వేలిముద్రలు తీసుకుని శాశ్వత ఆధార్ నంబర్ జారీ చేస్తాయి. 18 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలి’’ అని ఓ అధికారి తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి మరణించిన వారి వివరాలు వెంటనే ఆధార్ డేటా బేస్ లోకి చేరేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది. ‘‘ఇటీవల మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడంతో వారి పేరిట పెన్షన్ ను ఇంకా ఉపసంహరించకుండా ఆటోమేటిగ్గా జమ అవుతోంది’’ అని సదరు అధికారి తెలిపారు. అలాగే, ఒకే వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది.
తాజావార్తలు
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
-
Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
-
Accidnet: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
-
Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..