Udhayanidhi Stalin: తమిళనాడు వ్యాప్తంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉదయనిధి స్టాలిన్ ఫోటోలు ‘‘డోర్ మ్యాట్’’ ఉపయోగిస్తున్న వీడియో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారడంపై డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా సంయమనం పాటించాలని ఉదయనిధి తన పార్టీ సభ్యులకు సూచించారు. ప్రశాంతంగా ఉండాలని, ఆ వీడియోపై స్పందించొద్దని కోరారు. ఇలాంటి చర్యలు రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతాయంటూ ఉదయనిధి అన్నారు.
Read Also: DSC 2024: ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందచేసిన సీఎం రేవంత్ రెడ్డి
‘‘ నన్ను అవమానిస్తున్నారని భావించే ఈ సంఘీల పట్ట నేను జాలిపడుతున్నాను. వారి రాజకీయ అపరిపక్వత బట్టబయలైంది. వారికి అంత కోపం ఉంటే నేను ద్రావిడ సూత్రాన్ని అనుసరించి సరైన మార్గంలో ఉన్నట్లే’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘వారు పెరియార్‌పై చెప్పులు విసిరారు. అన్నాదురై, కరుణానిధిని అవమానించారు. పుట్టుక, మతం ఆధారంగా విభజించే భావజాలంతో ప్రజలను ఆకట్టుకోకపోవడం వల్ల వారు నిరాశలో ఉన్నారు’’ అని ఉదయనిధి అన్నారు.
నవంబర్, 2023 నుంచి వైరల్ అవుతున్న వీడియోని పోస్ట్ చేసిన ఉదయనిధి.. ‘‘వారు నా చిత్రాన్ని తొక్కనివ్వండి. మనం వారి మురికి మనస్సుని శుభ్రం చేయలేకపోతే, కనీసం వారి పాదాలను శుభ్రం చేద్దాం.’’ అని అన్నారు. తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఉదయనిధికి మద్దతుగా ‘‘తాను ద్రావిడానికి చెందిన వాడిని’’ అని కామెంట్ చేశారు.
என்னை இழிவு செய்வதாக நினைத்து தங்களின் அரசியல் முதிர்ச்சி இவ்வளவு தான் என்று அம்பலப்பட்டு நிற்கும் சங்கிகளைப் பார்த்து எனக்குப் பரிதாபம் மட்டுமே வருகிறது!
கொள்கை எதிரிகளுக்கு நம் மீது இவ்வளவு ஆத்திரம் வருகிறது என்றால், திராவிடக் கொள்கையினை நான் எந்தளவுக்குச் சரியாக… pic.twitter.com/rlLFPHUoJL
— Udhay (@Udhaystalin) October 9, 2024