Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Udayanidhi Stalin Gets Relief In Supreme Court Over Sanatana Dharma Remarks

Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌‌కి ఊరట

Published Date :March 6, 2025 , 12:46 pm
By Suresh Maddala
  • సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌‌కి ఊరట
  • సనాతన ధర్మం వ్యాఖ్యల కేసులో ఉపశమనం
  • కొత్త కేసులు నమొదు చేయొద్దని ఆదేశం
Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌‌కి ఊరట
  • Follow Us :
  • google news
  • dailyhunt

సుప్రీంకోర్టులో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట లభించింది. సనాతన ధర్మం వ్యాఖ్యలపై కొత్త కేసులను నమోదు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉదయనిధికి ఉపశమనం లభించింది. తదుపరి చర్యలకు కోర్టు అనుమతి అవసరం అని సుప్రీం ధర్మాసనం గురువారం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Minister Sridhar Babu: భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లు..

సనాతన ధర్మం వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఏకీకృతం చేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కేసులు నమోదు చేయొద్దని. అంతేకాకుండా చర్యలు తీసుకునే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది.

2023, సెప్టెంబర్‌లో ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని… డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అయితే తన వ్యాఖ్యలు ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కాదని.. సామాజిక అన్యాయాలను ప్రశ్నించడానికేనని ఉదయనిధి తెలిపారు.

ఇది కూడా చదవండి: AP Assembly 2025: అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు: మంత్రి కొండపల్లి

స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి వాదనలు వినిపించారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లతో పాటు.. బీహార్‌లో కొత్తగా కేసు నమోదైందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ.. కొత్త కేసులు నమోదు చేయొద్దని సూచించింది. ఇక కేసులను తమిళనాడుకు కాకపోయినా.. కర్ణాటకకు బదిలీ చేసే అవకాశాన్ని పరిశీలించాలని సింఘ్వి కోరారు. ఉదయనిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా లేవని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గతంలో మంజూరు చేసిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: ఈస్ట్జోన్ డీసీపీ కార్యాలయం నూతన బిల్డింగ్ను ప్రారంభించిన మంత్రి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • new cases
  • relief
  • SANATANA DHARMA REMARKS
  • Supreme Court
  • Udayanidhi Stalin

తాజావార్తలు

  • Ranveer Singh New Movie: రణవీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్, హీరోయిన్, టైటిల్ డీటెయిల్స్ ఇవే!

  • Peddi: గెట్ రెడీ గాయ్స్.. ‘పెద్ది’ కుస్తీ పట్టు చూస్తారా?

  • AP Petrol Shortage: ఏపీలో పెట్రోల్‌ కొరత.. సమస్యపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌

  • Gold &Silver Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంత? నేటి లేటెస్ట్ అప్‌డేట్

  • Mrunal Thakur Dating: ఆగిపోయిన డేటింగ్ వార్తలకు మృణాల్ మళ్లీ ఊపిరినిచ్చిందా?

ట్రెండింగ్‌

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions