Twitter Down:మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ మరోసారి మోరాయించింది. గురువారం ఉదయం ట్విట్టర్ డౌన్ అయింది. ట్విటర్ లో ఎర్రర్ మెసేజ్ కనిపించి.. ఆ తరువాత ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయ్యారు. దీనిపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ డౌన్ కావడం ఇది మూడోసారి. ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయిన తర్వాత.. ‘‘సంథింగ్ వెంట్ రాంగ్, బట్ డోంట్ వర్రీ- ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, లెట్స్ ట్రై అగైన్’’ అంటూ మెసేజ్ కనిపించింది. మళ్లీ ప్రయత్నించినా వినియోగదారులు ట్విట్టర్ లాగిన్ కాలేకపోయారు.
Read Also: Telangana IT Ministry Twitter: తెలంగాణ ఐటీ మినిస్ట్రీ ట్విటర్ ఖాతా హ్యాక్.. కానీ గంటలోనే..
డౌన్‌డెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ, నాగ్‌పూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మరియు కోల్‌కతాతో సహా పలు నగరాల్లో ఈ సమస్య ఏర్పడింది. పలుమార్లు యూజర్లు రిఫ్రెష్ చేసిన లాగిన్ కాలేకపోయారు. డెస్క్ టాప్ తో పాటు మొబైల్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.