కేంద్ర ఐటీశాఖ మంత్రికే షాక్‌ఇచ్చిన ట్విట్టర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ నడుస్తూనే ఉంది.. తాజాగా.. కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికార ఖాతా పనిచేయకపోవడం చర్చగా మారింది.. ఇటీవల కేంద్రం కొత్త ఐటీ రూల్స్ తేగా.. ట్విట్టర్ వాటికి అంగీకారం తెలపకపోవడంతో వివాదం మొదలు కాగా.. కొందరు బీజేపీ పెద్దల ఖాతాల విషయంలో ట్విట్టర్ వ్యవహారం కేంద్రానికి మరింత కోపం తెప్పించింది… ఇక, ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్‌ను యాక్సెస్ చేయలేకపోయానని తెలిపారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఒక గంట పాటు నా అకౌంట్ పనిచేయలేదని వెల్లడించారు.. ఆ సమయంలో కేంద్రమంత్రి ఎటువంటి ఫోటోలను కానీ, వీడియోలను కానీ ట్విట్టర్‌లో షేర్ చేయలేకపోయారు.. టీవీ చర్చలకు సంబంధించిన ఓ వీడియోలను అప్‌లోడ్ చేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారట.. అయితే.. ఆ పోస్టులు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై తన ట్విట్టర్ ఖాతా పనిచేయలేదని కూడా మంత్రి తెలిపారు.. కాగా, మంత్రి రవిశంకర్ అకౌంట్ మాత్రం నెట్ యూజర్లకు కనిపించింది. కానీ.. ఆయన మాత్రం లాగిన్ కావడానికి లేదా పోస్టు చేయడానికి వీలుపడలేదు.. ఆ సమయంలో డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్ యాక్ట్ నోటీసు వచ్చినట్లు వెల్లడించారు.. ఇక, ట్విట్టర్ చర్యలను ఖండించిన ఆయన.. ఐటీ చట్టంలోని రూల్ 4(8)ను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నారు.. ట్విట్టర్ ఉద్దేశం ఏదైనా.. ఇప్పుడు మరోసారి ట్విట్టర్ వర్సెస్ కేంద్రంగా మారింది పరిస్థితి.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!