Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divya Mittal: యూపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిత్తల్ సివిల్ సర్వీసెస్‌ను వీడిన తర్వాత తన తదుపరి అడుగుపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు, అయితే ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలతో కలిసి, ప్రజల సమస్యలు, ప్రశ్నలే ప్రాతిపదికగా ఒక కొత్త రాజకీయ వేదికను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పారు. ఆగస్టు 30, 2026న వ్యక్తిగత, కుటుంబ కారణాలతో 13 ఏళ్ల సర్వీసు తర్వాత ఐఏఎస్ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేయగా, సెప్టెంబర్ 15 నుంచి ఆ రాజీనామా అమల్లోకి వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటి నుంచి తదనంతర నిర్ణయంపై ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయని, ఈ కొత్త ప్రయాణానికి తనను తాను సిద్ధం చేసుకోవడం వల్లే సమాధానమివ్వడానికి కాస్త సమయం పట్టిందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ తనకు కేవలం పని ప్రదేశం మాత్రమే కాదని, ఇక్కడి ప్రజలు తనను ఒక కూతురిలా ఆదరించి తమ కుటుంబంలో ఒకరిగా చూసుకున్నారని, అందుకే తన రాజకీయ ప్రయాణాన్ని కూడా యూపీ నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చరిత్రలో అనేక సందర్భాల్లో దేశానికి దిశానిర్దేశం చేసిన ఘనత యూపీకి ఉందన్న ఆమె, ప్రజలు ఎవరినో ఒకరిని రక్షకుడిగా భావించి వేచి చూడకుండా, మార్పు కోసం తమవంతు ప్రయత్నం తామే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. తన దృష్టిలో రాజకీయం అనేది కేవలం ఒక పదవిని సాధించేందుకు మార్గం కాదని, ప్రభుత్వ ఆఫీసుల దాకా వెళ్లలేని, వెళ్లినా వినబడని సామాన్యుల గొంతుకగా మారడమే తన ఉద్దేశమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లవుతున్నా ఇంకా ప్రాథమిక సమస్యలు అలాగే ఉండిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
- Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Abhijeet Dipke: ‘సారీ’ అంటూ అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్.. దేనికోసమంటే..!
ఈ సందర్భంగా తన ఐఏఎస్ కేరీర్‌లోని కొన్ని అనుభవాలను ఆమె గుర్తుచేసుకున్నారు. మిర్జాపూర్ జిల్లాలోని లహురియాదహ్ కొండ ప్రాంతంలో తాగునీటి సరఫరా పనులను పరిశీలిస్తున్నప్పుడు ఒక మహిళ వచ్చి, అక్కడ ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలను తదుపరి స్థాయికి పెంచాలని కోరినట్లు చెప్పారు. పెన్షన్, ఇల్లు లేదా నీళ్ల కోసం అడుగుతుందనుకుంటే, పిల్లల చదువు కోసం అడగడం ఆమెను ఆలోచింపజేసింది. ఆ తర్వాత నిబంధనలు సడలించి పాఠశాలకు అనుమతి లభించినప్పటికీ, మూడేళ్లయినా నిర్మాణం ప్రారంభం కాలేదని, వనరులు ఉన్నా అధికారుల్లో పనిచేయాలనే సంకల్పం లోపించడమే దీనికి కారణమని విమర్శించారు. అలాగే రెవెన్యూ విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఒక నిరుపేద వ్యక్తి ప్లాస్టిక్ కవర్లో భూమి పట్టా కాగితాలు పట్టుకుని రాగా, భూమి మంజూరైనా ఆక్రమణ దక్కలేదని తెలిసింది. అధికారుల సమన్వయ లోపం, ‘పైన ఉన్నవారు వద్దంటున్నారు’ అనే అస్పష్టమైన సాకులు వినాల్సి వచ్చిందని, అసలు రాజ్యాంగంలో ప్రజలే అత్యున్నతులు అయినప్పుడు ప్రతి చిన్న హక్కు కోసం పైస్థాయి సిఫార్సులు ఎందుకని ఆమె ప్రశ్నించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సరైన రహదారులు, వంతెనలు లేకపోవడం వల్ల వర్షాకాలంలో గ్రామాలు దెబ్బతింటున్నాయని, ఉన్న రోడ్లపై గుంతల వల్ల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కేవలం ప్రమాదాలుగా చూసి వదిలేయకుండా, బాధ్యులపై చర్యలు ఉండేలా చూడాలన్నారు. విద్యా వ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీల వల్ల ఏళ్ల తరబడి కష్టపడే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగ రంగంలో వచ్చే మార్పులపై సరైన చర్చ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు కుమార్తెల తల్లిగా భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించడం తన బాధ్యత అన్నారు. కేవలం నాయకులను మార్చడం కాకుండా, రాజకీయాల శైలినే మార్చడమే తన ధ్యేయమని, ఇందుకోసం సదుద్దేశం, న్యాయం, బాధ్యత, సానుకూల ఆలోచన అనే సూత్రాలతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీలోనూ చేరకుండా ప్రజలతో కలిసే కొత్త వ్యవస్థను నిర్మిస్తానన్నారు. తన రాజీనామా తర్వాత సోషల్ మీడియాలో ఒక పార్టీ ప్రతినిధి లేనిపోని కలికట్టు కథనాలను ప్రచారం చేశారని, ఇటువంటి బెదిరింపులు లేదా ట్రోలింగ్‌లకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి డబ్బు, కండబలం, కుల రాజకీయాలు తనకు అవసరం లేదని, అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసినప్పుడు ఎప్పుడూ కులమతాలు చూడలేదని, రాజకీయాల్లోనూ అదే బాటలో నడుస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
-
WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
-
Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
-
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
-
Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!