Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Golden Bhagyam Movie Glimpse Goes Viral: టాలీవుడ్ కమెడియన్ సత్య, కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రల్లో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాల బ్యానర్లపై నాగార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాపి రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సత్య, యోగిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. ఈ సినిమాను కేవలం తెలుగు లేదా తమిళ చిత్రంగా కాకుండా.. రెండు భాషలకు చెందిన నటీనటులు, సంస్కృతులను మేళవిస్తూ రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ఇది తెలుగు, తమిళ సినిమా కాదు.. ‘తెలుమిళ్ సినిమా’ అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కాన్సెప్ట్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
Also Read
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
- Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
- Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. 'రామాయణ' పార్ట్ 1 టైటిల్ ఇదే!
- Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కామెడీతో పాటు లవ్, క్రైమ్, యాక్షన్ అంశాలు కూడా ఉండనున్నట్లు దర్శకుడు పవన్ బాసంశెట్టి హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో జయశ్రీ, అధిరాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, సుదర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ హాస్య నటుల కాంబినేషన్లో రూపొందుతున్న ‘గోల్డెన్ భాగ్యం’ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?