IMEEC: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధానికి దారి తీసింది. ముందు హమాస్ మొదలు పెడితే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పాలస్తీనా గాజా ప్రాంతంలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ యుద్ధం రెండు కీలక ఒప్పందాలను ప్రభావితం చేస్తోంది. ఇజ్రాయిల్-అమెరికా-సౌదీ అరేబియా మధ్య ఒప్పందాన్ని ప్రభావితం చేసింది. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయాలనే అమెరికా లక్ష్యాన్ని ఈ యుద్ధం దెబ్బతీసింది. ప్రస్తుతానికి ఈ ఒప్పందానికి సౌదీ బ్రేక్ వేసింది.
Israel Palestine Conflict: భారత్ ఇటీవలే జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఇందులో భారత్ సాధించిన అతిపెద్ద విజయం 'భారత్-పశ్చిమ ఆసియా-యూరప్' ఎకనామిక్ కారిడార్ ఒప్పందం.
Israel: చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్(IMEC)’పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో శనివారం అమెరికా, భారతదేశం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.
G20 Summit 2023: భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న జీ20 సదస్సు అనేక విధాలుగా చరిత్రాత్మకమైనది. సమ్మిట్ తొలిరోజు పలు కీలక ప్రకటనలు చేశారు. సమ్మిట్ ప్రధాన కార్యక్రమాలతో పాటు, భారతదేశం నుండి ఐరోపాకు వాణిజ్య మార్గాన్ని నిర్మించే కాన్సెప్ట్ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుందని అటువంటి ప్రకటన చేయబడింది.